అంగరంగ వైభంగా బతుకమ్మ సంబురాలు

ఖమ్మం, సెప్టెంబర్ 29: జిల్లా వ్యాప్తంగా సోమవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో బతుకమ్మలతో తరలివచ్చి ఆటపాటలతో ఆనందంగా గడిపారు.  తెలంగాణ మహిళా సమాఖ్య ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు పురస్కరించుకొని సోమవారం నగరంలోని రాపర్తినగర్ 2 ఏరియాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు.

kmm_raparti nagar

ఈ సందర్భంగా తెలంగాణ మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పోటు కళావతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలను వివిధ సంక్షేమ పథకాల్లో భాగస్వాములను చేసి వారికి అండగా నిలబడాలని ఆమె కోరారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురలు తాటి నిర్మల, పట్టణ నాయకురాళ్లు పాలడుగు శైలజ, ఉమ, విజయ, సింధు, తదితరులు పాల్గొన్నారు.

kmm-s.reddy_batukammaజిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆట పాటలతో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ ఆటలు, పాటలు అంగరంగవైభవంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొల్లు పద్మ మాట్లాడతూ అందరి జీవితాల్లో బతుకమ్మ, దసరా పండుగలు వెలుగులు నింపాలని ఆమె కోరారు.  హైందవ సంప్రదాయాలతో ముందు తరాలవారికి ఆదర్శప్రాయంగా ఉండాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో తాళ్లూరి ఝాన్నీ, కళావతి, తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.