అందరికి అందుబాటులో ఉంటా : సుజనా చౌదరి

హైదరాబాద్, నవంబర్ 13: తెలుగు రాష్ట్రాల అభివృద్దే తన లక్ష్యమని టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన సుజనాకు టిడిపి నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాన్ని భౌగౌళికంగా విభజించినప్పటికీ తెలుగు ప్రజలందరం కలిసి మెలిసి పనిచేసుకొని, రెండు రాష్ట్రాలను అభివృద్ధిలో చేయాలనేది మొట్టమొదటి ధ్యేయమన్నారు. కేంద్రమంత్రిగా రాష్ట్రాలకు రావల్సిన నిధుల విషయంలో కీలకపాత్ర పోషించి అభివృద్ధికి పాటుపడతానని ఆయన హమీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానన్నారు. ఇకపై ప్రతి నెల రెండు, నాలుగు శనివారాల్లో పార్టీ కార్యాలయంలో రెండు గంటల పాటు అందరికి అందుబాటులో ఉంటానన్నారు.  కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సుజనా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.