అక్కినేని జాతీయ పురస్కారం అందుకున్న అమితాబ్

akkineni award-27

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్

హైదరాబాద్, డిసెంబర్ 27: అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని మొట్టమొదటి సారిగా బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రతిష్టాత్మకంగా శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ తారలు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సినీ నటులు చిరంజీవి, జయసుధ, సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ అవార్డును అమితాబ్ కు ఇవ్వడంపై టాలీవుడ్ సినీతారలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న అమితాబ్ కు శంషాబాద్ ఏయిర్ పోర్టులో నాగార్జున స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి తెలంగాణకు విచ్చేసిన అమితాబ్ కు సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.