అక్టోబర్ లో చిక్కడు దొరకడు

హైదరాబాద్ : ఇటీవల తమిళనాడులో విడుదలై ప్రదర్శించబడుతున్న “జగర్ తండా“ చిత్రాన్ని తెలుగులో “చిక్కడు దొరకడు“ గా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ జరిగింది. తమిళ నిర్మాత ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. “పిజ్జా“ చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని అక్టోబర్ రెండవవారంలో విడుదలకు సిద్ధమవుతోంది. మీనాక్షి క్రియేషన్స్ పతాకంపై కదిరీశన్ నిర్మించిన ఈ చిత్రం ఓ విభిన్న కథంనంతో తెరకెక్కింది. ఈ చిత్రం గురించి నిర్మాత కదిరీశన్ మాట్లాడుతూ సిద్దార్ధ కెరియర్ ను మలుపుతిప్పే చిత్రంగా ఉండబోతుందన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతని అందించబోతుందని అన్నారు. సిదార్ధ, లక్ష్మిమీనన్ జంటగా నటించిన ఈ చిత్రంలో సిమ్కావిలన్ గా నటించారు. హీరో హీరోయిన్ లతో పాటు విలన్ పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉందన్నారు. తమిళ ప్రేక్షకులను ఆదరించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు కూడా అంతే విధంగా నచ్చుతుందన్నారు. ఇటీవల “చిక్కడు-దొరకుడు“ ఆడియో ఫంక్షన్ ను ఎంతో వైభవోపేతంగా నిర్వహించారని ఆడియోకి ఒక మంచి ఆదరణ లభించిందన్నారు. పిజ్జా చిత్రాన్ని అందించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎంతో కొత్త తరహా కధాంశంతో తెరకెక్కించారన్నారు. యువతతో పాటు ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని కదిరీశన్ వ్యక్తం చేసారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.