అక్బరుద్దీన్ పై దాడి కేసులో ముగ్గురికి బెయిల్ నిరాకరణ

Akbaruddin-Owaisi

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాడికి పాల్పడిన నిందితులకు హైకోర్టు నేడు బెయిల్ నిరాకరించింది. 2011 మే నెలలో అక్బరుద్దీన్ పై మహ్మద్ పహిల్వాన్ కుటుంబీకులు పాత కక్షల నేపథ్యంలో కత్తులు, తుపాకులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్బర్ క్రమంగా కోలుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ పహిల్వాన్, యూనస్ బిన్ ఒమర్ యాఫై , మున్వర్ ఇక్బాల్ ల బెయిల్ పిటిషన్లపై నేడు విచారించిన కోర్టు వారి పిటిషన్లు సమంజసంగా లేవని పేర్కొంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.