అగ్ని-3 పరీక్ష విజయవంతం

భూఉపరితలం నుంచి భూఉపరితలం మీదున్న 3000 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-3 క్షిపణిని భారత్ మరోసారి ప్రయోగించింది. ఒడిశాలోని వీలర్ ఐలండ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ప్రయోగం విజయవంతమైందని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రయోగాన్ని వివిధ ప్రాంతాల్లోని టెలిమెట్రీ స్టేషన్లు, ఎలెక్ట్రో ఆప్టిక్ సిస్టంలు, రాడార్లు, నావికాదళ నౌకల ద్వారా పర్యవేక్షించారు. అగ్ని-3 మిసైల్ 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వ్యాసము, 50 టన్నుల బరువు ఉంటుంది. ఇది ఒకటిన్నర టన్నుల వార్ హెడ్ ను మోసుకుపోతుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.