అట్టహాసంగా మహేష్ ‘నేనొక్కడినే’ ఆడియో ఫంక్షన్

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ రూపొందించిన ‘నేనొక్కడినే’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళా వేదికలో జరిగింది. కార్యక్రమంలో ఆడియోను మాస్టర్ గౌతం విడుదల చేసి మొదటి సీడీని సుకుమార్ కు అందజేశారు.

నన్ను ఎంతో అభిమానిస్తున్న మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. మేము చేయాల్సింది అంతా చేశాము మిగతాది మీరు చూసుకోవాలి జనవరి 10 న పండుగ బాగా చేసుకుందాము అన్నారు. కార్యక్రమంలో సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము అని మహేష్ బాబు అన్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో ఒక్కో పాటను ఒక ప్రత్యేక తరహాలో విడుదల చేయడమే కాకుండా ఆ పాటలకు ప్రముఖ డాన్స్ గ్రూప్ లతో డాన్స్ లు వేయించారు. కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. నాలుగు వందల స్కూళ్ళలో జరిగిన వన్ సినిమాపై జరిగిన ఈ వెంట్ లో గెలుపొందిన పలువురు విద్యార్థులు మహేష్ బాబు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

‘1’ సినిమాలో మైక్ పట్టుకుని రాక్ స్టార్ మహేష్ బాబు పాడే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో ‘హూ ఆర్ యూ’ అంటూ ఆయన ఎవరిని ఉద్దేశించి పాడుతున్నారన్నది సినిమాలో ఆసక్తికరమైన విషయం.
అయితే ఈ సినిమా ఆడియో వేడుకలో వ్యాఖ్యాత ఝాన్సీ మహేష్ బాబుని ఇదే ప్రశ్న వేసింది. ‘హూ ఆర్ యూ?’ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీరేం చెబుతారు?” అంటూ తమాషాగా ప్రశ్నించింది.

దానికి మహేష్ ఏమాత్రం తడుముకోకుండా ఆలోచించకుండా, “నేను కృష్ణగారి అబ్బాయి మహేష్ ని!” అంటూ ఠక్కున సమాధానం చెప్పడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. పక్కనున్న తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ముఖంలో విజయగర్వం తొణికిసలాడింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.