అధ్యాపకునిపై విద్యార్ధిని యాసిడ్ దాడి

acid-20

గుంటూరు, డిసెంబర్ 20: గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల్లో శనివారం దారుణం జరిగింది. వివాహం చేసుకుంటానని మోసగించిన అధ్యాపకునిపై ఓ యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన గుంటూరు నగర శివారు నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలలో చోటుచేసుకుంది.

నల్లపాడు ప్రభుత్వ మైనార్జీ పాలిటెక్నిక్ కళాశాలలో గణిత అధ్యాపకుడు వెంకట రమణ, నర్సారావుపేటకు చెందిన సౌజన్య అనే యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుంటానని ఆ యువతిని వెంకటరమణ నమ్మించాడు.  ఈ నేపథ్యంలో వెంకటరమణ ఈ ఏడాది ఆగస్టు 15న రహస్యంగా మరో యువతిని పెళ్ళి చేసుకున్నాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న సౌజన్య శనివారం కళాశాలకు వచ్చి తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ ను అతని ముఖంపై చల్లింది. దీంతో అతని మొహం పూర్తిగా కాలిపోవడంతో, చికిత్స నిమిత్తం అతనిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేసురుకొని సౌజన్యను అదుపులోకి తీసుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.