అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని అంత్యక్రియలు పూర్తి

akkineni-nageshwar-rao

బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోస్ లో పూర్తయ్యాయి. ఆయన పాడిని కుమారుడు నాగార్జున, మనవళ్లు సుమంత్, సుషాంత్, నాగ చైతన్య, అఖిల్ మోశారు. మరో నటుడు కృష్ణంరాజు కూడా కాసేపు పాడెను మోసి, పాడెతో పాటే నడిచారు. ఈ సందర్భంలో నాగార్జున ఉద్వేగాన్ని ఆపుకోలేక రోదించారు.

అక్కినేని చితికి ఆయన పెద్ద కుమారుడు వెంకట్ నిప్పు పెట్టారు. మూడు సార్లు చితి చుట్టూ తిరిగిన అనంతరం చితికి నిప్పు పెట్టారు. అనంతరం చిన్న కుమారుడు నాగార్జున, మనుమలు కూడా కుటుంబ పెద్ద చితికి నిప్పు పెట్టారు.

అక్కినేని అంత్యక్రియలు పూర్తి స్థాయి అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఆయన చితికి నిప్పు పెడుతున్న సమయంలో పోలీసులు గౌరవసూచకంగా మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం పోలీసు బ్యాండ్ తో గౌరవ వందనం చేశారు. మహానటుడికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.