అన్నిప్రాంతాలను అభివృద్ధి చేస్తా : చంద్రబాబునాయుడు

cm-chandrababu-vij-20

తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

హైదరాబాద్, నవంబర్ 20: అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కార్యకర్తల అండతో సంక్షోభాలను ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. విజయవాడలో ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొంత మంది నాయకులు స్వార్ధంతో పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉన్నారని చెప్పారు. దాని వల్ల పార్టీ అన్ని చోట్ల బలంగా ఉందన్నారు. ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంచేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అమలుచేయగలిగితే ప్రజల్లో విశ్వాసం పెంపొందించే దిశగా కృషిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు చంద్రబాబు పిలపునిచ్చారు.

తెలంగాణలో టిడిపిని దెబ్బతీసేందుకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టిడిపిని ఎవరు ఏమి చేయలేరన్నారు. సమన్యాయమంటే ఏమిటని కొందరు ప్రశ్నించారని, దానికి అభివృద్ధే అన్ని ప్రశ్నలకు సమాధానమని చంద్రబాబు పేర్కొన్నారు. సమావేశంలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, మురళీమోహన్, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సుజనాచౌదరి, నందమూరి బాలకృష్ణ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.