అన్ని రాష్ట్రాలతో సమానంగా చూడొద్దు : చంద్రబాబునాయుడు

తిరుపతి, సెప్టెంబర్ 12: రాష్ట్ర పునర్విభన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వేరే రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ ని చూడవద్దని 14వ ఆర్ధిక సంఘాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. తిరుపతిలో 14వ ఆర్ధిక సంఘంతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ..  అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి జరగాలంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం సిఫార్సు చేయాలని కోరామన్నారు.

పునర్విభన కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు ప్రవేటు ఇన్వెస్ట్ మెంట్ కలిసి ఈ 56 సంవత్సరకాలంలో 13.50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, ఆ విధంగా చేశారు కాబట్టే హైదరాబాదు ఆదాయం మరియు సంపద పెరిగిందని చంద్రబాబు తెలిపారు. అటువంటి రాజధానిని ఏర్పాటు చేయాలంటే కనీసం 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల ఖర్చవుతుంది, దీనిలో కనీసం 1.02 లక్షల కోట్ల రూపాయలు కావాలని ఆర్ధిక శాఖను కోరినట్లు చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా ఒక స్పెషల్ గ్రాంట్ ఇన్ ఏయిడ్ 41,500 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆర్ధిక శాఖను అభ్యర్ధించామన్నారు. అంతేకాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక నిధిని ప్రకటించాలని కోరామని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణం 10,400 కోట్లు మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఆర్ధిక సంఘాన్ని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. సంఘం ప్రతినిధులకు రెండు విజ్ఞపన ప్రతాలు ఇవ్వడంతో పాటు  రాష్ట్ర పరిస్థితుల గురించి పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 14 వ ఆర్ధిక సంఘం సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.