అన్న అళగిరి వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందన

Alagiri-Stalin

డీఎంకెలో కుటుంబ తగాదాలు రోడ్డున పడ్డాయి. మరో మూడు నెలల్లో స్టాలిన్ చనిపోతాడంటూ డీఎంకె అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అన్న అళగిరి వ్యాఖ్యలపై స్పందించిన స్టాలిన్.. పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చనిపోతారని నీతి వ్యాఖ్యలు చెప్పాడు. అయితే ఈ మాటల్లో అంతరార్థమేమిటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ తన అన్న అళగిరి దిష్టిబొమ్మలను  పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా దహనం చేయవద్దని స్టాలిన్ పిలుపునిచ్చారు. పార్టీ క్రమశిక్షణ అన్నింటికంటే ప్రధానమని, తన గురించి అళగిరి చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవట్లేదని స్టాలిన్ చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.