అభిమాని కుటుంబానికి 2 లక్షల నష్ట పరిహారం

హైదరాబాద్ అక్టోబర్ 1: రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే చిత్రం బుధవారం విడుదలైంది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన కన్నయ్య చిత్రం చూసేందుకు వచ్చి మృతి చెందాడు. స్థానిక శివ థియేటర్ లో టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
కన్నయ్య మృతి పట్ల రామ్ చరణ్ సంతాపం ప్రకటించారు. కన్నయ్యను ఆదుకునేందుకు హీరో రామ్ చరణ్ ముందుకు వచ్చారు. అతడి కుటుంబానికి రూ.2 లక్షలు నష్ట పరిహారాన్ని అందించనున్నట్లు రామ్ చరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.