అభిమాన నేత కేసీఆర్ కు ఘన స్వాగతం

ఎన్నో సంవత్సరాల తెలంగాణా ఆకాంక్షను నిజం చేసిన తమ అభిమాన నేతకు అపూర్వ రీతిలో స్వాగతం పలికేందుకు తెలంగాణా ప్రజలు భారి ఎత్తున హైదరాబాద్ కు తరలి వచ్చారు. 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆరాధ్య నేత, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బేగంపేట విమానాశ్రయంలో అపూర్వ రీతిలో స్వాగతం లభించింది.

తొలుత భారీ సంఖ్యలో బ్రాహ్మణోత్తములు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మెదక్ చర్చికి చెందిన క్రైస్తవ మత గురువులు, ముస్లిం, సిక్కు మత పెద్దలు ఆయనకు దీవెనలు అందించారు. కేసీఆర్ రాకతో బేగంపేట విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ వాదులతో నిండిపోయాయి.

అధిక సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలంగాణ మహిళలు తమ అభిమాన నేతకు మంగళహారతినిచ్చి ఘన స్వాగతం పలికారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.