అమరవీరులకు నివాళులర్పించిన కేసీఆర్

kcr-land-in-hyd

తెలంగాణ విజయోత్సవ ర్యాలీ బేగంపేట ఎయిర్ పోర్టు నుండి గన్ పార్కు చేరుకుంది. బేగంపేట ఎయిర్ పోర్టుకు కేసీఆర్ చేరుకోగానే వెయ్యి మంది వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలాగే సర్వమత పార్ధనలు జరిపారు. దాదాపు ఐదు వందల మంది తెలంగాణ మహిళలు మంగళహారతులు ఇచ్చి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణలోనే అడుగుపెడతానని శపథం చేసిన కేసీఆర్ నెల రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టడంతో కార్యకర్తల్లో, అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హెలికాప్టర్ లో బేగంపేటకు చేరుకున్నారు. బేగం పేట నుంచి ర్యాలీగా బయలుదేరి గన్ పార్కు చేరుకున్నారు. అమరవీరులకు నివాళులర్పించి తెలంగాణ భవన్ కు వెళ్లారు. పార్టీ పెట్టినపుడు జల దృశ్యం వద్ద ఉపయోగించిన ప్రచార రథంపైనే కేసీఆర్ ర్యాలీలో పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.