అమరుల త్యాగాలు అమూల్యం : కేసీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 21: పోలీసు అమరుల త్యాగాలు అమూల్యమైనవి, విధి నిర్వహణలో అమరులైన పోలీసులు దేవునితో సమానమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మంగళవారం నగరంలోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అతనికి ప్రతినెల వచ్చే వేతనాన్ని పదవీ విరమణ వరకు వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. అంతేకాకుండా పిల్లల చదువులు, ఇండ్ల స్థలం ఏర్పాటు తదితర బాధ్యతను ప్రభుత్వం  తీసుకుంటుందన్నారు. అమరుల కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. మీడియా, సినిమా వాళ్లు పోలీసులను కించపరిచేలా చూడటం, మాట్లాడం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను చెడుగా చూడటం దేశానికి అంత మంచిది కాదన్నారు. పోలీసు శాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 20 మందికి పోలీసులకు పతకంతోపాటు రూ 5 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

ప్రస్తుతం కానిస్టేబుళ్లకు రోజువారి చెల్లిస్తున్న వేతనం రూ. 90 నుంచి రూ. 250 కి  పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య భద్రత కింద ప్రస్తుతం ఉన్న లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, హోం మంత్రి నాయిని నరసింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.