అమితాబ్ కు సమన్లు జారీ చేసిన అమెరికా కోర్టు

amitabh bachchanహైదరాబాద్, అక్టోబర్ 28: బాలీవుడ్ నడుడు అమితాబచ్చన్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు అమెరికాలోని ఓ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. సమన్లపై అమితాబ్ 21 రోజుల్లో స్పందించాలని కోర్టు తెలిపింది. న్యూయార్క్ కు చెందిన సిక్కుల సంస్థ, ఇద్దరు బాధితులు దాఖలు చేసిన పిటీషన్ పై లాస్ఏంజెల్స్ లోని జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది.  1984 లో ఇందిరా గాందీ హత్య తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో అమితాబ్ బచ్చన్ హింసను ప్రేరేపించారని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని సిక్కు హక్కుల పరిరక్షణ గ్రూప్ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.  దాంతో న్యాయస్థానం అమితా బచ్చన్ కు సమన్లు జారీచేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.