అమెజాన్ తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం

హైదరాబాద్: ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవగాహాన ఒప్పందం కుదుర్చుకొంది. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద గిడ్డంగిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకొంది.

అమెజాన్ కంపెనీ  సీనియర్ ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ నాయకత్వంలో ప్రతినిధి బృందం ఐటి శాఖ మంత్రి కెటిఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటి కార్యకలాపాల నిర్వహాణకు తెలంగాణ రాష్ట్రం ఉపయోగపడుతోందని అమెజాన్ కంపెనీ ప్రతినిదులు అభిప్రాయపడ్డారు. 2లక్షల80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గిడ్డంగిని నిర్మించనున్నట్లు వారు తెలిపారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో 11 గిడ్డంగులను తమ సంస్థ నిర్మించిన విషయాన్ని అమెజాన్ సంస్థ ప్రతినిధులు గుర్తు చేశారు.

ఈ సమావేశానికి ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తో క్యాంప్ కార్యాలయంలో అమెజాన్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. అమెజాన్ కంపెనీ నిర్మించతలపెట్టిన గిడ్డంగికి మూడు వారాల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.