అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు : కేసీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 5: అల్లరి చేష్టలతో అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేస్తున్న అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఒక్క నెల దాటిన తర్వాత రౌడీలు, అల్లరి మూకలు ఆడపిల్లలను చూస్తే భయపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దీనిపై ఎవరు విదాలు సృష్టించాలని చూసినా వెనక్కు తగ్గేది లేదని, ఈ విషయంలో కఠినంగా ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.