‘అమ్మ’ ఎప్పుడూ నిరాశపరచదు

ISRO 4హైదరాబాద్, సెప్టెంబర్, 24: భారతదేశం తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం ఉపరితలానికి 515 కిలో మీటర్ల దూరం, భూమికి 215 కిలోమీటర్ల దూరంలో మామ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు.  రోదసిలో 10 నెలల ప్రయాణం అనంతరం మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అరుణ గ్రహం కక్ష్యలోకి ప్రవేశించి భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగురవేసింది. బుధవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఉపగ్రహ యాంటెన్నాను ఇస్రో మళ్లించింది. అంగారక గ్రహం వైపు 6.57 నిమిషాలకు మామ్ దూసుకెళ్లడం, 7.30 నిమిషాలకు ప్రధాన ఇంజన్ లోని 440 న్యూటన్ లిక్విడ్ అపోజి మోటర్ పనిచేయడం ప్రారంభించింది. ఉదయం 7.54 గంటలకు అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించింది. మామ్ ప్రయోగం విజయవంతమమైనట్టు యూఎస్, యూరప్, భారత్, ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన ఎర్త్ స్టేషన్లలోని రాడార్స్ కు సిగ్నల్ అందాయి.

బెంగళూరులోని ఇస్ట్రాక్ ప్రాంగణంలో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన ప్రపంచ దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

Mangalyaanమామ్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మంచి పనిని మొదలుపెట్టాం.. అంతా మంచే జరుగుతుందని అన్నారు. నష్టభయాన్ని భరించగలిగిన ధైర్యం మనకు కావాలి. అప్పుడే విజయాలను సొంతం చేసుకోగలుగుతామన్నారు. మామ్ అంటే అమ్మ… మనల్ని అమ్మ ఎప్పుడూ నిరాశ పరచదు. అంతరిక్ష పరిశోదనల్లో ఆసియాలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అరుణగ్రహానికి పంపిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇవాళ చరిత్ర లిఖించాయని అభివర్ణించారు. తొలి ప్రయత్నంలోనే మనం విజయం సాధించామని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ నిలిచిందన్నారు. మన శాస్త్రవేత్తల కఠోర శ్రమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. మన శాస్త్రవేత్తల విజయాలు రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.