అమ్మ లేదు… నాన్న రాలేని పరిస్థితి

హైదరబాద్, నవంబర్ 13: “ఒక వైపు అమ్మ లేదు, నాన్న ఉన్నా రాలేని పరిస్థితి, అమ్మ లేకుండా ప్రమాణస్వీకారం చేయడం బాధగా ఉందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆళ్లగడ్డ శాసనసభ ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడేల శివప్రసాద్ రావు అసెంబ్లీలోని తన ఛాంబర్ లో అఖిల ప్రియతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ అమ్మ లేకుండా ప్రమాణస్వీకారం చేయడం బాధగా ఉందన్నారు. అమ్మ ఆశలు నిలబేట్టేందుకు అహర్నిశలు కృషిచేస్తానన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రసావిస్తానని తెలిపారు. వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వొమ్ము చేయనని అఖిల తెలిపారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, నంధ్యాల వైసీపి కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటానని అఖిలప్రియ పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.