అరబిందో పార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఆగంతుకుడి కాల్పులు

హైదరాబాద్, నవంబర్ 19: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ దుండగుడు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి పై కాల్పులు జరిపాడు. కేబీఆర్ పార్కులో ఉదయపు నడక ముగించుకొని నిత్యానందరెడ్డి కారెక్కారు. ఇంతలో మరోపక్కనుంచి కారులోకి ఎక్కిన ఆగంతకుడు ఏకే 47తుపాకితో నిత్యానందరెడ్డిని బెదిరించాడు. తాను చెప్పినవైపు కారు పోనివ్వాలని తుపాకి గురిపెట్టాడు. నిత్యానందరెడ్డి తనకు గురిపెట్టిన తుపాకి బ్యారెల్ ను దూరంగా నెట్టివేయడంతో ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పుల మోత విని అక్కడికి చేరుకున్న నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి వెనకవైపును ఆగంతకుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దుండగుడు ఆయన చేయి కొరికి పరారయ్యాడు. ఏకే 47, బ్యాగ్ అక్కడే వదిలేసి ఆగంతకుడు పారిపోయాడు. తనకు ఎవరితోను గొడవలు, మనస్పర్ధలు లేవని, నిందితుడ్ని తాను గుర్తు పడతానని నిత్యానందరెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఘటనా స్థలంలో పోలీసులకు 8 బుల్లెట్ షెల్స్ లభ్యమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.