అలిపిరి బాంబు దాడి కేసులో దోషులకు శిక్ష ఖరారు

హైదరాబాద్ : అలిపిరిలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై 2003లో జరిగిన బాంబు దాడి కేసులో తాజాగా మరో ముగ్గురిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో నిందితులు రాంమ్మోహన్ రెడ్డి, నర్సింహారెడ్డి, కేశవ్ లను దోషులగా నిర్థారిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. వీరికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానాను విధించింది.
2003 అక్టోబరు ఒకటిన తిరుమల శ్రీవారి బ్రహోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి హోదాలో వెళ్తండగా అలిపిరి వద్ద చంద్రబాబుపై ఈ దాడి జరిగింది. చంద్రబాబుతో సహా మిగిలినవారు ఈ దాడి నుంచి స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే 2011లో న్యాయస్థానం తొలి తీర్పు వెలువరించింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఆధారాలు లేవంటూ ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.