అలిపిరి వద్ద సీఎం కాన్యాయ్ లోని వాహనానికి స్వల్ప ప్రమాదం

తిరుపతి : అలిపిరి వద్ద సిఎం కాన్యాయ్ లోని వాహనానాకి స్వల్ప ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో చివర ఉన్న తుడా వైస్ చైర్మన్ వాహనం ఇంటిలిజెన్స్ ఐజి అనురాధ వాహనాన్ని ఢీకొట్టడంతో వైస్ చైర్మన్ కారు స్వల్పంగా దెబ్బతింది. 2003లో అలిపిరి వద్ద చంద్రబాబునాయుడుపై బాంబు దాడి జరిగిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పద్మావతి అతిథిగృహం వద్ద చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారిని లోనికి వెళ్లనీయకుండా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.