అశోక్ బాబు ప్యానల్ ఘన విజయం

APNGO-Ashok-Babu

ఎంతో ఉత్కంఠగా నువ్వా నేనా అని వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ సాగిన ఏపీఎన్జీవో సంఘం ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి.ఏపీఎన్జీవో సంఘానికి జరిగిన ఎన్నికల్లో అశోక్ బాబు ప్యానల్ ఘనవిజయం సాధించింది. అశోక్ బాబు కు 638 ఓట్లు రాగా, బషీరుద్దీన్ కు 164 ఓట్లు వచ్చాయి. కాగా 13 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు ఈ ఫలితాలే సమాధానమని అన్నారు. తమ నాయకత్వం ఉన్నంతకాలం సమైక్యాంధ్ర కోసం పోరాడుతామని తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.