అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగాయి : స్పీకర్

speaker-29

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్ మధుసూధనాచారి

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణ శాసనసభా సమావేశాలు సజావుగా జరిగాయని స్పీకర్ మధుసూధనాచారి వెల్లడించారు. శనివారం జరిగిన విలేకరు సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తారీఖు నుంచి నేటి వరకు శాసనసభ సమావేశాలు 19 రోజుల పాటు సజావుగా సాగాయని తెలిపారు. మొత్తం శాసనసభ జరిగిన సమయం 88.6 గంటలు జరిగిందన్నారు.

బడ్జెట్‌పై ఐదు రోజుల పాటు చర్చ జరిగిందని పేర్కొన్నారు. బడ్జెట్‌పై 15.17 గంటలపాటు చర్చ జరిగిందని తెలిపారు. బడ్జెట్‌పై చర్చలో అన్ని పార్టీలు పాల్గొన్నాయని తెలిపారు. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గంట 5 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. మొత్తం సభ్యులు అడిన 123 ప్రశ్నలకు సభలో జవాబులు వచ్చాయని చెప్పారు.

బడ్జెట్‌పై టీఆర్ఎస్ 3.40 గంటలు, కాంగ్రెస్ 3.17 గంటలు, ఎంఐఎం 1.45 గంటలు, బీజేపి 1.25 గంటలు, వైసీపీ 20 నిమిషాలు, సీపీఐ 21 నిమిషాలు, సీపీఎం 22 నిమిషాలుపాటు బడ్జెట్‌పై మాట్లాడారని స్పీకర్ తెలిపారు. బడ్జెట్‌ పై వివరణకు 2.01 గంటలు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మధ్యలో కల్పించుకున్న సమయం 49 నిమిషాలు.  బడ్జెట్‌పై 7, 11, 12, 13, 14 తేదీల్లో చర్చ జరిగిందని చెప్పారు. బడ్జెట్‌పై మొత్తం 15 గంటల 17 నిమిషాలు చర్చ జరిగిందని తెలిపారు. బడ్జెట్ పై డిస్కషన్ 11 గంటల 22 నిమిషాలు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరిగాయని స్పీకర్ మధుసూధనాచారి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.