అసైన్డ్ భూములపై సభాసంఘం ఏర్పాటు

హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణలోని పదిజిల్లాల్లో కబ్జాలకు గురైన అసైన్ట్ భూములపై సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం  టి ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. 1.9 లక్షల ఎకరాలు కబ్జాకు గురైనట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో తెలిపారు. దీనిపై విచారణకు సభాసంఘాన్ని నియమిస్తున్నట్లు వెల్లడించారు. తొలుత  ఈ అంశాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు లేవనెత్తారు. కేవలం ఎకరాకు 25 వేల రూపాయల వంతున 8.8 ఎకారల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎ.పి.ఐ.ఐ.సి నుంచి పొన్నాల లక్షయ్య కొనుగోలు చేశారని హరీశ్ వెల్లడించారు. అసైన్డ్ భూములను అమ్మటంగాని, కొనడంగానీ చేయకూడదని ఆయన తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని కాగ్ కూడా అభిప్రాయపడినట్లు హరీష్ రావు చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.