అహంకారపూరిత ధోరణి ఉండకూడదు : ప్రకాష్ రాజ్

హైదరాబాద్, అక్టోబర్ 4: డైరెక్టర్‌ శ్రీను వైట్లపై నటుడు ప్రకాష్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు నటించిన ఆగడు చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో  ప్రకాష్ రాజ్‌ ఓ ప్రధాన పాత్ర పోషించాడు. కానీ సినిమా అసిస్టెంట్, దర్శకులతో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో ప్రకాష్ రాజ్‌ ను శ్రీనువైట్ల తప్పించారనే వార్తలు వచ్చాయి. దీంతో శ్రీనువైట్ల, ప్రకాష్ రాజ్‌ ల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి.

ఆగడు సినిమాలో విలన్ పాత్రకు ఉపయోగించిన డైలాగులపై ఆయన తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక మనిషి ఒక సినిమాలో నటించడం ఇష్టం లేకపోతే తీసేయవచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి పంపేయాలనుకుంటే కుదరదన్నారు. శ్రీనువైట్లది అహంకారపూరిత ధోరణి అని తెలిపారు.  మనిషికి అహంకారం ఉండకూడదన్నారు. మహేశ్ బాబు లాంటి అద్భుతమైన నటుడిని, డబ్బు పెట్టే నిర్మాతలు అందరినీ, ప్రేక్షకుల సమయాన్ని కూడా వాడుకుంటూ, చివరకు గుర్తింపునిచ్చే కళామతల్లిని కూడా వాడుకోవడానికి సిగ్గులేదు అని ఆయన అన్నారు. ప్రకాష్ రాజ్‌ చేసిన తాజా ఆరోపణలపై శ్రీను వైట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.