ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రకు వెళ్లాల్సిందే: కేసీఆర్

kcr-trs

ఎక్కడి ఉద్యోగులు అక్కడికేనన్నారు కేసీఆర్. ఆంధ్రా ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఉండవని చెప్పారు. అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలంటే అక్కడి ఉద్యోగులు అక్కడికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.ఉద్యోగుల ఆప్షన్లపై టిడిపి, కాంగ్రెస్, బిజేపీలు తమ వైఖరి తెలుపాలన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులలో వరదనీరు నిండినతరువాతే ఆంధ్రప్రాజెక్టుల్లోని అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు వదులుతామని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుత పద్దతుల్లో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చి కడితే తమకు అభ్యతరం లేదన్నారు.

తెలంగాణలో టిఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఢిల్లీ నాయకులు చెప్పినట్లు నడుచుకోవాలని అదే టిఆర్ యస్ అధికారంలోకి వస్తే ప్రజలు చెప్పినట్లు నడుచుకుంటుందని తెలిపారు. బంగారు తెలంగాణ సాధించుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఆటోలున్నాయని ఆటోలకు రవాణా పన్ను రద్దు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో టిఆర్ యస్ పార్టీ తన మేనిఫెస్టోను సిద్దం చేస్తుందని కేసీఆర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.