ఆఫర్లతో హోరెత్తిస్తున్న విమానయాన కంపెనీలు

Flight-charges

దేశీయ విమానయాన కంపెనీలు ప్రయాణికులకు భారీ తగ్గింపు ఆఫర్ ల ను ప్రకటించాయి. స్పైస్ జెట్ తో పాటు ఇండిగో, ఎయిరిండియా వంటి కంపెనీలు తమ టిక్కెట్ల బేస్ ధరపై దాదాపు 50% తగ్గింపును ఇస్తున్నట్లు వెల్లడించాయి. కేవలం 3 రోజుల పాటు మాత్రమే అమల్లో ఉండే ఈ ఆఫర్ , ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 15 వరకూ చేసే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.

ఆఫ్ సీజన్ నేపథ్యంలో దేశీయ విమానయాన కంపెనీలు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు బంఫర్ ఆఫర్ లను ప్రకటించాయి. జనవరి నుంచి మార్చి వరకూ విమానయాన రంగంలో గిరాకీ తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించి ఎయిర్ ట్రాఫిక్ ను పెంచుకునేందుకు ఇప్పుడు ఎయిర్ లైన్స్ కంపెనీలు కొత్త ప్రణాళికలతో రెడీ అయ్యాయి. అందులో భాగంగానే టిక్కెట్ ధరలపై 50శాతం డిస్కౌంట్ ను ప్రకటించాయి. స్పైస్ జెట్ తో పాటు ఇండిగో, ఎయిరిండియాలు బేస్ టిక్కెట్ ధరపై 50శాతం తగ్గింపును ఇస్తున్నట్టు వెల్లడించాయి. ఇందులో ముందుగా స్పైస్ జెట్ ఆఫర్ ను గమనిస్తే జనవరి 21నుంచి బుక్ చేసుకున్న టిక్కెట్లపై 50శాతం తగ్గింపును ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్ మూడు రోజుల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది. 30రోజుల లేదా 60రోజుల అడ్వాన్స్ బుకింగ్ పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్ జెట్ తెలిపింది. మరోవైపు ఇండిగో కూడా ఇంచుమించు ఇదే రకమైన ఆఫర్ ను ఇస్తున్నట్టు వెల్లడిచింది. ఇక ప్రభుత్వ రంగ కంపెనీ ఎయిరిండియా 50%తగ్గింపు ఆఫర్ ను ప్రకటించింది. ఈ మూడు కంపెనీలతో పాటు గో ఎయిర్ కూడా ఇదే రకమైన ఆఫర్ ను ప్రకటించే అవకాశముంది. మరోవైపు సీజన్ లేనప్పుడు ఎయిర్ లైన్స్ కంపెనీలు ఇలాంటి ఆఫర్లను ప్రకటించడం సర్వసాధారణమేనని నిపుణులు చెపుతున్నారు. మార్చి త్రైమాసికంలో ఆదాయాలను పెంచుకునేందుకు ఇలాంటి ఆఫర్లు ఉపయోగపడతాయని వారంటున్నారు. ఏది ఏమైనా ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకునే విమాన ప్రయాణికులు ఈ ఆఫర్లను సద్వినియోగపర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.