ఆమ్ ఆద్మీతో లోక్ సత్తా పొత్తు: జయప్రకాశ్ నారాయణ

Aam-Admi-loksatta

ఢిల్లీలో విజయకేతనం ఎగురవేసిన ఆమ్ ఆద్మీ బాటలో లోక్ సత్తా పార్టీ అడుగులు వేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో లోక్ సత్తా పార్టీ పొత్తుకట్టే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. దీనిపై ఈ నెల 20న అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం కానున్నట్టు ఆయన చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్ఫూర్తితో రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నామని ఆయన వెల్లడించారు. లోక్ సత్తా పార్టీ, ఆమ్ ఆద్మీతో పొత్తు కుదిరితే ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటుందో వేచి చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.