ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

first cabinet-16 sakalam

కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రి వర్గ విస్తరణ మంగళవారం రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగింది. ఆరుగురు కొత్త మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో సహా కొత్త మంత్రులతో మంత్రుల సంఖ్య 18కి చేరింది. టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, జడ్చర్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ములుగు ఎమ్మెల్యే చందూలాల్, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌ రెడ్డిలతో గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరై కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు అభినందనలు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.