ఆరు సిలిండర్లు చాలు: పనబాక

Panabaka-lakshmi

ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు సరిపోతాయంటూ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు కన్నా ఎక్కువ సిలిండర్లు సబ్సిడీపై అందిస్తే వాటిని దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలు అమ్మేసుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. సొంత నియోజకవర్గమైన బాపట్లకు వచ్చిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వ్యాఖ్యలతో ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.

కేంద్రప్రభుత్వం ఒక్కో కుటుంబానికి గ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై ఆరు నుంచి తొమ్మిదికి పెంచిన విషయం విదితమే. పన్నెండుకు పెంచాలని మధ్య తరగతి వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తడంతో ఆ దిశగా కేంద్రం ప్రయత్నాలు కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.