ఆర్టీసీ బస్సు, డీసిఎం వ్యాను ఢీ: డ్రైవర్ సజీవదహనం

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆర్టీసీ బస్సు, డీసిఎం వ్యాను ఢీకొన్న సంఘటనలో బస్సు డ్రైవరు సజీవదహనమైయ్యాడు. పొలీసుల కథనం ప్రకారం… సోమవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా ఇంజామూర్ నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు బయలుదేరిన ఆర్మూరు డిపో బస్సు ఈ తెల్లవారు జామున 2-30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఆర్మూరుకు బయలుదేరిన బస్సు బోయిన్‌పల్లి శ్రీలత గార్డెన్ మలుపు వద్ద మొక్కజొన్న లోడుతో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. దీంతో బస్సుకు వెంటనే మంటలు చేలరేగడంతో క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ గంగాధర్ సజీవదహనమయ్యాడు.  వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై బస్సులో నుంచి కిందకు దూకేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.  అందులో గాయపడిన 15 మంది ప్రయాణికులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.  బస్సులో నుంచి కిందకు దూకిన మిగతా ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. క్షణాల్లో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయింది. మూడు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

రవాణా శాఖ మంత్రి మహీందర్ రెడ్డి ఈ రోజు ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన డ్రైవర్ గంగాధర్ కుంటానికి 6 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.