ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఆర్థిక సంఘంతో సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసంఘానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించింది. KCR in 14thఈ ప్రతిపాదనల విలువ సుమారు రూ.23,475 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనాలు వేశారు. ఇందులో పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రూ.4216, చెరువుల పునరుద్దరణ, అభివృద్ధికి రూ.4,200, ఐటీ రంగానికి రూ.1,091, వాటర్‌గ్రిడ్‌కు రూ.7,700, హరితహారానికి రూ.1000, ప్రాథమిక విద్యకు రూ.1,300, వ్యవసాయ విద్యుత్ కోసం రూ.1,300 కోట్లుగా పేర్కొంటూ ప్రతిపాదనలు రూపొందించి సమర్పించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 50 శాతానికి పెంచాలని, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

KCR_Eetalaరాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ సింహభాగంగా ఉందని, కాని మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు మరింత వెనుకబాటులో ఉన్నాయని వివరించారు. రానున్న నాలుగేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయనున్నట్లు సంఘం సభ్యులకు వివరించారు.  దళితులకు 3 ఎకరాల భూ పంపిణి కార్యక్రమం ప్రారంభించనట్లు వెల్లడించారు. ఇంటింటికీ త్రాగునీరు అందించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హరితవనాకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ప్రతి నియోజవర్గంగలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. విద్యత్ కోతలను అధిగమించేందుకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఇటీవల నిర్వహించిన సమగ్ర  సర్వే విజయవంతమైందని, దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు  చేరే అవకాశం ఉందని సభ్యులకు సీఎం తెలియజేశారు. నిధులకోసం కేంద్రానికి ప్రతిపాదించాలని ప్రణాళికా సంఘం సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.