ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏకగ్రీవం

ఆళ్లగడ్డ, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ ఎమ్మల్యేగా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ ఎన్నిక లాంఛన ప్రాయమైంది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.