ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన ముంబయి బాధితురాలు

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన ముంబయి బాధితురాలు

ముంబయి: సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి జస్లోక్ ఆసుపత్రిలో ఉత్తమ వైద్య చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యపరిస్థతిని ప్రత్యేకంగా నియమించబడిన డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చింది. ఇప్పుడామె ఆరోగ్యం కుదుటపడిందని, ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని జస్లోక్ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.  బాధితురాలికి సైకాలాజికల్ కౌన్సిలింగ్ అందిస్తున్నట్లు ఇటీవల ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒక ఇంగ్లీషు మ్యాగజైన్ కు పనిచేస్తున్న ఈ యువ ఫోటో జర్నలిస్టు పై ఆగష్టు 22వ తేదీన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత డిసెంబరులో న్యూఢిల్లి లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. దేశవ్యాప్తంగా ఈ అమానుషం పట్ల తీవ్ర నిరసన పెల్లుబుకింది. నిందితులకు కఠినశిక్షలుె విధించాలన్న డిమాండ్ తో ఆందోళనలు కొనసాగాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.