‘ఆహా కళ్యాణం’ ఆడియో లాంచ్

Aha Kalyanam

దక్షిణాది రంగంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘ఆహా కళ్యాణం’. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథానాయకుడిగా ఈగ ఫేమ్ నాని, కథనాయికగా వాణికపూర్ జంటగా నటిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘బ్యాండ్ బాజా బారాత్’ చిత్రానికి ‘ఆహా కళ్యాణం’ రిమేక్ గా వస్తుంది. ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి దగ్గుపాటి రానా ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ చిత్రానికి ధరణ్ కుమార్ చక్కటి సంగీతాన్ని అందించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.