ఇంకా కుదుటపడని నాయుడు సర్కార్

వందరోజుల పాలనలో మెరుపుల కంటే మరకలే అధికం

వ్యవసాయ రుణ మాఫీపై అనుమానాలు

హైదరాబాద్: ఇప్పుడిప్పుడే  గాడిలో పడుతున్నఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరును వంద రోజుల్లో నిర్ణయించడం కష్టం.  ఉద్యోగుల పంపిణీ కూడా పూర్తి కాని కారణంగా ప్రభుత్వం ఇంకా స్థిరపడలేదు. కానీ ఎన్నికల సమయంలో చేసిన అన్ని వాగ్దానాలూ నేరవేరాలంటే ముందుగా ప్రభుత్వం పని సాఫీగా సాగిపోవాలి. ప్రస్తుతానికి ప్రభుత్వ పోకడలను స్థూలంగా గమనించి దాని పనితీరు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందో ఒక అంచనాకు రావడానికి మాత్రమే అవకాశం ఉంది.
అధికారంలోకి వచ్చే ముందు రాజకీయపార్టీలు చేసే వాగ్దానాలను సంపూర్ణంగా నిర్వర్తించడం అనేది ఏ పార్టీకి అయినా అసాధ్యం. ప్రపంచంలో అత్యుత్తమ ప్రభుత్వాలు సైతం యాభై శాతం వాగ్దానాలకు మించి అమలు చేయజాలవు.

ముఖ్యంగా వ్యవసాయ రుణాల మాపీ చేస్తామని చేసిన వాగ్దానం ఫలితంగానేతెలుగు దేశం పార్టీ సార్వత్రిక ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలిగింది.  భారత రిజర్వు బ్యాంక్ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదించగా, దీనిపై వారు సాధ్యాసాధ్యాలు పరిశీలనచేసి రుణాలు మాఫ్ చేయడం సాధ్యంకాదని తేల్చారు.  అటవంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. రైతుల రుణమాఫీ కోసం ఆయన బడ్జ్ ట్ లో రూ 5,000 కోట్లు కేటాయించారు. ఇది అరకొర కేటాయింపు మాత్రమే. రుణ మాఫీకి అనుసరించవలసిన నియమనిబంధనలను సూచించేందుకు ఒక కమటీని కూడా నియమించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో చేసిన వ్యవసాయ రుణాల మాఫీ అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అంత చురుకుగా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని నిర్మాణానికి ఉత్తమ ప్రాంతాన్ని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటి సలహాలను తోసిపుచ్చి, విజయవాడను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కేంద్రంగా ప్రకటించారు.

కేంధ్ర ప్రభుత్వానికి శివరామకృష్ణ కమిటి నివేదిక సమర్పించక మునుపే విజవాడను కొత్తరాష్ట్రానికి రాజధానిగా నిర్ణయించడం, అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వకుండా హడావిడిగా ఆ నిర్ణయాన్ని ప్రకటించడం అప్రజాస్వామికం. రాజధానిని ప్రకటించే ముందు అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ సి పి పట్టుబట్టినా పట్టించుకోలేదు. విజయవాడను రాజధానిని ప్రకటించాడాన్నిఇతర పార్టీల వారు అభ్యంతరం చెప్పనప్పటికీ ప్రకటించిన తీరును తప్పుబట్టారు.

చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వేడుకలను నిర్వహించడం అనుచితంగా ఉందని వైఎస్ఆర్ సిపి నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు చేయకుండా వంద రోజుల పాలన వేడుకలను నిర్వహించే హక్కు  టిడిపికి లేదన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రకటించిన వైట్ పేపర్ (వివరణ పత్రం)లో లెక్కనేనన్ని తెల్లని అబద్ధాలను నింపారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి మజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ రైతులు, మహిళా పొదుపు సంఘాల వారు ప్రభుత్వంపై విశ్వాసాన్ని పూర్తిగా వీడలేదు. అయితే టిడిపి చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఎంతో కొంత సమయం పడుతుందే తప్ప హామీలు జరిఃగి తీరుతాయనే ఆశతో ఉన్నారు. సమాజంలో టీడీపీ వంద రోజుల పాలనపై మిశ్రమ భావన ఉంది. కేవలం నాలుగు నెలల పరిపాలనను పరిశీలించి ప్రభుత్వం  విఫలమైందనే నిర్ధారణకు రావడం తొందరపాటేనని చాలా మంది భావిస్తున్నారు.

రాష్ట్ర మంత్రులందరు ఐ పాడ్ తో సోమవారం మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలనే చంద్రబాబు ఆలోచన చరిత్ర సృష్టించింది. దేశంలోనే ఇటువంటిది మొట్టమొదటిది. ఈ-సమావేశం నిర్వహించడం ఒక  వినూత్నమైన ఆలోచన దీనిని చంద్రబాబు నాయుడిని అభినందించవచ్చు.

రెండు రాష్ట్రాల మధ్యా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ ఇంకా పూర్తి కావలసి ఉంది, ప్రభుత్వం తాత్కాలిక ప్రాంగణంలో పనిచేస్తున్నది, ​​మంత్రులకు అప్పగించిన బాధ్యతలు వారికి అలవాటు కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే నిర్ధారణకు ఇంతలోనే రావడం నిర్దాక్షిణ్యమే అనిపించుకుంటుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.