ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ కు సుప్రీంకోర్టు అనుమతి

supreme court 1న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఊరట లభించింది. ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. నవంబర్ 15 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఆదేశించింది. 2013-14 అనుబంధ కళాశాలలకే వర్తిస్తుందని, స్లైడింగ్ కు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలోని 174 కళాశాలలకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2015 జనవరి 30వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించాలి,  అదే విధంగా ఫిబ్రవరి 15 నుంచి రెండవ షెడ్యూల్ మొదలుపెట్టి జూన్ చివరి వరకు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.