ఇందన పొదుపులో రాష్ట్రానికి అవార్డు

Petrol

ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఈ మేరకు ఇంధన పొదుపులో లక్ష్యాలు సాధించిన రాష్ట్రాల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసింది. ఇంధన పొదుపుపై దేశ వ్యాప్తంగా ‘పెట్రోలియం కన్సర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్’ పరిశీలనలు నిర్వహించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఇంధన పొదుపుపై రాష్ట్ర ప్రజల్లో అవగాహన పెంచడంతోనే పొదుపు సాధ్యమైందని, తద్వారా లక్ష్యం చేరుకున్నట్లు సంస్థ గుర్తించింది. ఈ నెల 16న కేంద్ర చమురు, సహజవాయువు మంత్రిత్వ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చేతుల మీదుగా ఈ అవార్డును ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఈ అవార్డును అందుకోనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.