ఇక దీక్షాపర్వం

ఇక దీక్షాపర్వం

తెలంగాణా వ్యాప్తంగా ఇక వారం రోజుల పాటు దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణా రాజకీయ జేఏసి కన్వినర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఈ దీక్షలు జరుగుతాయి. ఈ వారాన్ని ముల్కీ అమరవీరుల స్మృతి వారంగా నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. టిఎన్జీవోభవన్ లో తెలంగాణా జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులు ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సమావేశమై భేటీ ముగిసిన తర్వాత కోదండరాం ఈ విషయాలు వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.