ఈ నెల 14న ‘భీమవరం బుల్లోడు’

bheemavaram-bullodu-movie

ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో డి.సురేష్ బాబు నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘భీమవరం బుల్లోడు’. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ… ‘భీమవరం బుల్లోడు’ కథకి రవితేజ, వెంకటేష్ వంటి నటులు కూడా చేయడానికి వీలుగా ఉంది. అంతటి కమర్షియల్ వాల్యూస్ తో కూడుకున్న కథ అని చెప్పారు.

మొదట ఈ సినిమాకి ‘దసరా బుల్లోడు’ అనే టైటిల్ పెట్టాలనుకున్నాం కానీ ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’ గా మార్చాము. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని అందించాడు. అనూప్ రూబెన్స్ పాటలకు మంచి స్పందన వస్తుండటంతో ఇటీవలే ఓ కొత్త పాటను కూడా ఆడియో జత చేశాము. చిత్రంలో చిన్న చిన్న కరెక్షన్లు చేసాము. సునీల్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు ఉదయ్ భాస్కర్ చెప్పారు. హీరో సునీల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు మంచి లవ్ ట్రాక్ ఉంది. నేను పది సినిమాల్లో చేసిన కామెడీ ఈ ఒక్క సినిమాలో ఉంటుందని చెప్పారు. హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్రని చాలా చక్కగా డిజైన్ చేశారు. సునీల్ గారితో నటించడ్ చాలా ఆనందంగా ఉందని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.