ఈ నెల 6 నుండి ఏపీఎన్జీవోల నిరవధిక సమ్మె

APNGOs

ఏపీఎన్జీవో భవన్ లో ఉద్యోగ సంఘాలు సమావేశమై తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సమావేశమైన అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. సమ్మెకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ను కలిసి నోటీసును అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమ్మె పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అశోక్ బాబు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకోవాల్సిన బాధ్యత సీమాంధ్ర నేతలదేనని అశోక్ బాబు స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.