‘ఈ రోజుల్లో’ మారుతీకి బన్నీ ఛాన్స్

Maruti-bunny

తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి మంచి విజయాలను సాధిస్తున్న యువ దర్శకుడు మారుతి అతిత్వరలోనే బన్నీతో సినిమా చేస్తానని చెబుతున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా మారుతి ‘కొత్త జంట’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలో అతని అన్న అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

“అల్లు అర్జున్ తో నాకు మంచి అనుబంధం వుంది. గత పదేళ్ళ నుంచీ మేం కలసి ట్రావెల్ చేస్తున్నాం. నా సినిమాలు రిలీజయిన తొలిరోజే తను చూస్తాడు. తర్వాత ఆ సినిమాపై చాలా లోతుగా డిస్కస్ చేస్తాడు. నేను చేసే కామెడీ సీన్లను తను బాగా ఎంజాయ్ చేస్తాడు. తప్పకుండా అతనితో సినిమా చేస్తాను. అయితే, అది ఎప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను” అంటున్నాడు మారుతి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.