ఉచిత నీటి సరఫరా ఫైలుపై కేజ్రీవాల్ తొలి సంతకం

Aravind-kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు నూతన సంవత్సర కానుకను ఇచ్చారు. ప్రతి ఇంటికీ రోజుకు 666 లీటర్ల శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని కేజ్రీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయన ఫైలుపై సంతకం చేశారు. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ, తన నివాసంలోనే జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ తన కలల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.