ఉత్కంఠతకు తెరపడింది

ఉత్కంఠతకు తెరపడింది

అధికార పార్టీకే మెదక్ స్థానం

ఆత్మపరిశీలనలో కాంగ్రెస్, బిజేపి

హైదరాబాద్, సెస్టెంబర్ 16: మెదక్ ఫలితం కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. ఫలితాన్ని ప్రకటించారు. మెదక్ పార్లమెంటు స్థానాన్ని ఓటర్లు అధికార పార్టీ అభ్యర్ధికి తమ ఓటుతో తీర్పు ఇచ్చారు. మెదక్ లోక్ సభ ఉపఎన్నికల ప్రచారం మునుపెన్నడు జరగని రీతిలో జరిగింది. ఈ ప్రచారం తీవ్రత మెదక్ ఉపఎన్నిక ప్రాధాన్యాన్ని చాటింది.  ప్రథనాంగా మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న 14 లక్షల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నాయకులూ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులూ, భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర నాయకులు పోటా పోటీగా ప్రచారంలో పాల్గొన్నారు.

మెదక్ ఓటర్లు అధికార పార్టీ అభ్యర్ధికి తమ ఓటుతో తీర్పు ఇచ్చారు. ఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అభ్యర్ధి ఎంపికైనప్పటినుంచి ప్రచార భాద్యతను టి ఆర్ ఎస్ తరఫున నీటి పారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు అప్పగించారు. నియోజవర్గ ప్రాంతాలలో సభలు, రోడ్ షోలు నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఆధ్వర్యంలో సంగారెడ్డి, పటాన్ చెరువు ప్రాంతాలలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నర్సంపేట బహిరంగ సభలో పాల్లొన్నారు. సమిష్టి కృషితోనే విజయం సాధ్యమైందని పలువురు నాయకులు, పార్టీ వర్గాలవారు అభిప్రాయ పడుతున్నారు. అధికార పార్టీపై విమర్శలు చేసినవారు రెండు, మూడు స్థానాలకు పరిమితమైనారు.

మెదర్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నిరాశ మిగిల్చాయి. మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మధుయాష్కీ, గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహతో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున సభలు, రోడ్ షోలలో పాల్గొన్నప్పటికి ఫలితం దక్కలేదు. ఎన్నికల్లో ఓటమికి తానే భాధ్యత వహిస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గాంధీభవన్లో అన్నారు.

ఉప ఎన్నిక ఫలితాలు బిజేపికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మెదక్ ప్రజలు బిజేపిని మూడోస్థానికి పరిమితం చేస్తూ ఫలితాన్నిచ్చారు. వివాస్పద మాజీ కాంగ్రెస్ నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) ని బిజేపి అభ్యర్థిగా ఎంపిక చేసింది.  తెలుగుదేశం పార్టీ మద్దతుతో బిజేపి ఈ ఎన్నికను సమిష్టిగా పోరాడినప్పటికి ఆశించిన స్థాయిలో ఫలితం కనబడలేదు. ఉప ఎన్నిక ప్రచారంలో అధికారపార్టీని విమర్శించడంలో కాంగ్రెస్ కంటే ముందుంది. అన్ని కలిసివస్తే తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయపార్టీగా ఎదుగుతామని పార్టీనేతలు చెబుతూ వచ్చారు. సాధరణ ఎన్నికల కంటే మూడు శాతం ఎక్కువ ఓట్లు రాబట్టగలిగామని పార్టీనేతలు సంతృప్తితో ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.