ఉత్తరాంధ్రకు సినీ నటుల విరాళం

హైదరాబాద్, అక్టోబర్ 14: హుద్ హుద్ తుపానుతో అతలాకుతలం అయిన ఉత్తరాంధ్ర ప్రజలను ఆర్ధికంగా ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అంతేకాకుండా వీలైనంత సహాయసహకారాలు అందించాలని ఆయన అభిమానులకు పిలుపు నిచ్చారు. సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రూ 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. తుపాను సహాయక చర్యల్లో అభిమానులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.  మరి కొంత మంది సినీ నటులు మహేష్ బాబు రూ 25 లక్షలు, జూనియర్ ఎన్ టి ఆర్ రూ 20 లక్షలు, అల్లు అర్జున్ రూ 20 లక్షలు, రాంచరణ్ రూ 10 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు వారు ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.