ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ రాజీనామా

Uttarakhand-cm-vijay-bahuguna

ఉత్తరాఖండ్ సీఎం పదవికి విజయ్ బహుగుణ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ కు సమర్పించారు. గతేడాది జూన్ నెలలో ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదల్లో వేల సంఖ్యలో మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. కేదర్ నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు వరదల్లో చిక్కుకుని వేల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వరదల సమయంలో బహుగుణ సరిగా పనిచేయలేకపోయారన్న అంశంపై గుర్రుగా ఉన్న కేంద్రం పదవినుంచి తొలగించినట్లు సమాచారం. కొత్త ముఖ్యమంత్రిగా హరీశ్ రావత్ ను కేంద్రం ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.