ఉపాధితోనే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది : మోదీ

న్యూఢిల్లీ: ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు పెరగాలని, అప్పుడే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞన్ భవన్ లోని ఏర్పాటు చేసిన మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా లోగో, వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో పెట్టుబడుదారులు పారిశ్రామిక అభివృద్ధిపైన, ఉత్పాదక రంగంమీద దృష్టి సారించాలన్నారు. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు, ఉత్సాదకతకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. దీనికోసం వాణిజ్య సంస్థల సమస్యలను 72 గంటల్లోగా పరిష్కరించేలా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. మేకిన్ ఇండియా డాట్ కామ్ వెబ్‌పోర్టల్‌ ద్వారా ఏర్పాటైన ఈ ప్రత్యేక సెల్‌ ఆన్‌లైన్‌లోనే వాణిజ్య సంస్థ సమస్యలకు నిర్దేశిత సమయంలోగా పరిష్కారాలు సూచిస్తుంది మోదీ పేర్కొన్నారు.

భారత్‌ను ఉన్నతమైన అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్లడానికి నిబద్ధతతో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఉత్పాదక రంగంలో భారత్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ఉత్పాదక రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. భారత్ ను డిజిటల్ ఇండియా మార్చడానికి సహకారం అందిస్తాసమని రిలయల్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. జీటీఎస్ ని వీలైనంత త్వరగా అమలుచేయాలని ఆయన కోరారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని టాటా సైరన్ మిస్త్రీ తెలిపారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి తరుణమని బిర్లా సంస్థల అధినేత మంగళం బిర్లా అన్నారు. ఈ కార్యక్రమంలో పలు వాణిజ్య సంస్థల అధిపతులు, 500 లకు పైగా దేశ విదేశీయుల సీఈవోలు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.